Wednesday, July 3, 2019

Ee Roju Rasi Phalalu, Panchangam 04 July 2019

ది. 04-జులై-2019 బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాడ మాసం శుక్లపక్షం.
ఈ రోజు తిది విదియ రాత్రి 09.18 PM తదుపరి తదియ తిథి  ప్రారంభం.  ఈ రోజు నక్షత్రం పునర్వసు పగలు 06.48 AM తదుపరి పుష్యమి నక్షత్రం ఈరోజు యాగాధ యోగం పగలు 11.05 AM వరకు.  ఈరోజు బాలవ కరణం 10.19 AM తదుపరి కౌలవ కరణం 09.18 PM.  ఈ రోజు వర్జ్యము 02.17 PM నుండి  03.47 PM వరకు. ఈ రోజు దుర్ముహూర్తం 09.53 AM నుండి 10.45 AM వరకు.  ఈరోజు అమృత ఘడియలు 06.02 AM. ఈరోజు రాహుకాలం 01.30 PM నుండి  03.00 PM వరకు. ఈరోజు  గుళిక కాలం 09.00 AM నుండి 10.30 AM వరకు. ఈరోజు యమగండం 06.00 AM నుండి 07.30 AM వరకు.

ఈరోజు విశేషం నెలపొడుపు. నెలపొడుపు రోజున చంద్రుడు సన్నతి గా కనిపిస్తాడు. నెలపొడుపు రోజున ప్రతి మనిషి చేయవలసిన పని ఏమిటి అంటే ఈ రోజున చంద్ర దర్శనం చేసుకుని మన ఒంటిమీద ఉన్న  వస్త్రం నుండి  2 నూలు  పోగులు అంటే దారములు తీసుకుని చంద్రుని వైపున విసిరి నమస్కారం చేసుకోవాలి దీన్ని చంద్రునికో నూలుపోగు అని శాస్త్రం చెబుతుంది ఇలా చేసినట్లయితే మనకు జీవితంలో అన్న వస్త్రాలకు లోటు ఉండదని శాస్త్రంలో చెప్పారు.

మీ పూర్తి రాశి ఫలితాల కోసం క్రింది వీడియో ని క్లిక్ చేయండి.


No comments:

Post a Comment